జిన్‌పింగ్‌తో బ్లింకెన్‌ భేటీ.. చైనా-అమెరికా విభేదాలు పరిష్కారమైనట్టేనా..?

-

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం రోజున బ్లింకన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. వాటి వివరాలు వెల్లడి కాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

‘‘నాకు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మధ్య బాలీలో కుదిరిన అవగాహనకు అనుగుణంగా ముందడుగు వేయాలని మా నేతలు బ్లింకెన్‌కు స్పష్టంచేశారు. ఈ దిశగా రెండు దేశాలు పురోగతి సాధించి, కొన్ని అంశాలపై ఒప్పందాలు కుదిరాయి’’ అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అంతకుముందు బ్లింకెన్‌.. చైనా విదేశీ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ వాంగ్‌ యీతో సమావేశమయ్యారు. చైనాతో ఉన్న విభేదాల విషయంలో అమెరికా లోతుగా ఆలోచించి, సర్దుబాటు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వాంగ్‌ కోరారు. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి అమెరికా లోపభూయిష్ట భావనలే కారణమని పేర్కొన్నారు. చర్చలా.. ఘర్షణా అన్నది తేల్చుకోవాల్సిన కీలక తరుణంలో బ్లింకెన్‌ పర్యటన సాగుతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news