ఆఫ్ఘనిస్తాన్: ఉపసంహరించుకున్న అమెరికా బలగాలు.. స్వాతంత్ర్యం వచ్చిందన్న తాలిబన్లు

-

గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ గురించ్ రోజూ వార్తల్లో వస్తూనే ఉంది. ఆఫ్ఘన్ లో ఉగ్రవాదుల దాడులు, దానికి ప్రతీకారంగా అమెరికా జరిపిన డ్రోన్ దాడులు మొదలైనవన్నీ యుద్ధ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా అమెరికా బలగాలు కాబూల్ విడిచి వెళ్ళిపోయాయి. కాబూల్ నుండి చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి పయనమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాకు లార్డ్ సీ 17అనే చివరి విమానం వెళ్ళింది. అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు.

తమకు స్వాతంత్ర్యం వచ్చిందని గాల్లోకి కాల్పులు జరిపి మరీ సంబారాలు చేసారు. ఆఫ్ఘనిస్తాన్ లో 20ఏళ్ళ పాటు అమెరికా సేనలు పోరాడాయి. అక్కడ సైన్యాన్ని బలపర్చడానికి దాదాపు 2లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. ఐతే ఎన్ని చేసినా, చివరికి అటు ఆఫ్ఘన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటు ప్రస్తుతం అమెరికా సేనలు కూడా ఉపసంహరించుకున్నాయి. మరి తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి.

Read more RELATED
Recommended to you

Latest news