Breaking news: న్యూయార్క్ లో కాల్పులు… పలువురు మృతి

-

అమెరికాలో మరోసారి కాల్పల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లో ఓ సబ్ వేలో కాల్పులు చోటు చేసుకున్నాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో పలువురిపై కాల్పులు జరిగినట్లు  అక్కడి అధికారలు వెల్లడించారు. బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు భవన నిర్మాణ కార్మికుడి డ్రస్ వేసుకుని, గ్యాస్ మాస్క్ తో ఉన్నాడని బాధితులు చెబుతున్నారు. సన్‌సెట్ పార్క్ పరిసరాల్లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో నుంచి పొగలు రావడం గమనించిన అగ్నిమాపక సిబ్బంది… ఆతరువాత కాల్పులు జరిగాయని నిర్థారించుకున్నారు. కాగా..  ఈఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ దాడి ఉగ్రవాదులు చేశారా..? మరెవరైనా చేశారా..? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news