ఇరు దేశాలలో ఏ దేశం అయినా మధ్యవర్తిత్వం చేయమని ప్రత్యేకంగా కోరితే తప్ప స్వయంగా తాము భారత్- చైనా ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో జోక్యం చేసుకోబోమని రష్యా స్పష్టం చేసింది. అయితే, సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి రష్యా రెండు దేశాలను ప్రోత్సహిస్తూనే ఉంది. మంగళవారం ఢిల్లీలో రష్యా డిప్యూటీ చీఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
చర్చల ద్వారా భారతీయ మరియు చైనా పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటారనడంలో రష్యాకు ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. “రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్… చైనా రక్షణ మంత్రిని కలవమని మేము చాలా ప్రోత్సహించం. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) కార్యక్రమంలో డాక్టర్ జై శంకర్ కూడా చైనా విదేశాంగ మంత్రిని కలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.