ట్రాన్స్ జెండర్లపై సమాజంలో చాలా వ్యతిరేకత అనేది ఉంటుంది. వారిని చాలా మంది అవమానకరంగా మాట్లాడటమే కాకుండా అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. దీనితో పాపం కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. వారు ఎక్కువగా ఏ పని దొరకక యాచిన్చుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అందుకే తమిళనాడులోని కోయంబత్తూరులో వారి కోసం ప్రత్యేకంగా ఒక కిచెన్ మొదలు పెట్టారు.
ట్రాన్స్ జెండర్ల బృందం కోయంబత్తూరులో కోవై ట్రాన్స్ కిచెన్ అనే తినుబండార దుకాణం ప్రారంభించింది. కోయంబత్తూర్ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ చీఫ్ సంగీత మాట్లాడుతూ… “మేము మరొక తినుబండార దుకాణం తెరవాలని యోచిస్తున్నామని చెప్పారు. మా సమాజంలో యాచించడం మానేసి, స్వావలంబన పొందడం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. ధైర్యంగా దీనిని ముందుకు నడిపిస్తామని చెప్పారు.