మళ్ళీ పెళ్లి చేసుకున్న జాన్ సీనా… ఇది ఎన్నో పెళ్ళంటే…!

-

ప్రముఖ డబ్ల్యూడబ్ల్యుఇ స్టార్ జాన్ సినా మరోసారి వివాహం చేసుకున్నాడు. బుధవారం ఫ్లోరిడాలో జరిగిన ప్రశాంతమైన, ప్రైవేట్ వేడుకలో ప్రియురాలు షే షరియాత్జాదేతో ఆయన వివాహం చేసుకున్నారు. దీని గురించి అతను ఏ ప్రకటన చేయకపోయినా సరే అమెరికా మీడియాకు సమాచారం అందింది. అధికారిక రికార్డులను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్ లోని స్థానిక మీడియా వివాహాన్ని ధృవీకరించింది.

డబ్ల్యుడబ్ల్యుఈ మహిళా రెజ్లర్ నిక్కి బెల్లాతో… జాన్ విడిపోయాడు. ఆ తర్వాత అతను షే షరియాట్జాదే 2019 ప్రారంభం నుంచి ప్రేమలో ఉన్నాడు. కెనడా పౌరసత్వం ఉన్న షరియాత్జాదే టెక్ కంపెనీకి ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివారు. సేనా ఎలిజబెత్ హుబెర్డీయుతో 2009 నుండి 2012 వరకు వివాహ బంధంలో ఉండగా… ఆ తర్వాత నిక్కీ బెల్లాను వివాహం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news