అంతర్జాలంలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన సర్చ్ ఇంజిన్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ఈ బ్రౌజింగ్ యాప్ 28 ఏళ్ల సుదీర్ఘ సేవలకు మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టింది. 1995లో ప్రారంభమై 28 సంవత్సరాలు సేవలు అందించిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇకపై కనిపించదు.
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లపై ఫైనల్ అప్‌డేటెట్ వెర్షన్‌ను ‘ఐఈ11’ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కొత్త బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్ ద్వారా పాత బ్రౌజర్‌ను నిలిపివేసింది. ఈ బ్రౌజర్ ఇకపై ‘నో మోర్’ ‘రిటైర్డ్’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్ సపోర్టును ఆపేస్తున్నట్టు వెల్లడించింది.
పాత బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అప్‌డేట్ ఇస్తామని తెలిపింది. ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్‌ను కమర్షియల్, కన్జ్యూమర్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఇస్తాం’ అని పేర్కొంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను పూర్తిగా నిలిపివేసే ప్రక్రియను మైక్రోసాఫ్ట్ గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. అప్పటి నుంచే ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఐఈకి ది ఎండ్ పలికింది.