ఐపీఎల్‌లో మొదలైన ప్లే ఆఫ్‌ రేస్‌..ఈ టీంలకే చాన్స్…!

-

కరోనా ఎఫెక్ట్‌తో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్‌ సూపర్‌గా కొనసాగుతోంది. ఎప్పటిలాగే పరుగుల వరద.. ఎప్పటిలాగే వినోదం.. ఎప్పటిలాగే ఉత్కంఠ.. ! ఫ్యాన్స్‌కు కిక్‌ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లీగ్‌ దశ ఫైనల్‌ స్టేజ్‌ చేరుకుంది. రోజులు దగ్గర పడే కొద్ది దూకుడును పెంచాయ్‌ అన్ని టీమ్‌లు. విజయం కోసం పోటా పోటీగా తలపడుతున్నాయ్‌. ఆఖరి బంతి వరకు గెలుపు కోసం ఏ మాత్రం తగ్గడం లేదు. పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌లో ఉన్న టీమ్స్‌ కూడా తమ వేటను మొదలెట్టాయ్‌. టాప్‌ టీమ్స్‌తో సై అంటున్నాయ్‌. ఈ సీజన్‌లో టాప్‌ ప్రదర్శన చేస్తున్న టీమ్స్‌కు షాక్‌ ఇచ్చి ప్లే ఆఫ్‌ రేస్‌ను రసవత్తరంగా మార్చేశాయ్‌.

లీగ్‌ దశలో అన్ని జట్లూ దాదాపుగా పది మ్యాచ్‌లు ఆడేశాయ్‌. రెండేళ్ల క్రితం వరకు అనామక జట్టుగా ఉండే ఢిల్లీ గతేడాది సూపర్‌ఫామ్‌నే ఇప్పుడూ కొనసాగిస్తోంది. 10మ్యాచ్‌లాడి 14 పాయింట్లతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. పూర్తిస్థాయి బలం, బలగం ఉన్నముంబై నుంచి ఢిల్లీకి పోటీ ఎదురవుతోంది. 12 పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది ముంబై. ఒక్కసారీ కప్‌ గెలవని బెంగళూరు సైతం ఈసారి సమతూకంతో రాణిస్తోంది. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్‌ రేసులో తానున్నాని చాటిచెప్పింది. ఇక హిట్టర్లతో నిండిన కోల్‌కతా సైతం 10 పాయింట్లతో దూకుడుగానే ఉంది. ఈ నాలుగు టీమ్‌లు పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌-4 లో ఉన్నాయ్‌.

ఇక కింది నుంచి నాలుగు స్థానాల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, హైదరాబాద్‌, చెన్నై ఉన్నాయ్‌. హ్యాట్రిక్‌ విక్టరీలు కొట్టిన పంజాబ్‌ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతోంది. మిడిలార్డర్‌ సమస్యను అధిగమిస్తోంది. ఆరంభంలో రెండు విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్‌ ఆ తర్వాత తడబడింది. అయితే గత మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఫామ్‌ అందుకుంది.ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి దారుణంగా ఉంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి ఏడో స్ధానంలో ఉంది సన్‌రైజర్స్‌. లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నైకి ఈ సారి కలిసిరాలేదు. కీలక ఆటగాళ్లు లేకపోవడం, మిగిలిన వారు రాణించకపోవడం, ధోనీ ఆత్మవిశ్వాసంతో లేకపోవడం ఆ జట్టుకు శాపాలుగా మారాయి. అందుకే కేవలం 3 మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news