బీసీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఈ మంత్రుల మాటే చెల్లుబాటైందా…!

-

ఏపీలో కొందరు మంత్రులు చక్రం తిప్పారు. స్థానిక అవసరాలు తమ పలుకుబడిని ఉపయోగించి పదవులు పట్టేశారు. తమ జిల్లాకు, అనుచర వర్గానికి పెద్దపీట వేశారా? పార్టీలోని ప్రత్యర్ధి నేతలకు చెక్‌ పెట్టే విధంగా పావులు కదిపారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.

ఏపీలో బీసీలు అత్యధికంగా ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ బీసీ కార్డు తెరమీదకు వస్తుంది. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి స్పీకర్‌, డిప్యూటీ సీఎం, ఒక మంత్రి ఉన్నారు. ముగ్గురూ బీసీ సామాజికవర్గానికి చెందిన వారే. తొలుత మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ రెండున్నరేళ్ల డెడ్‌లైన్‌లోపే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్‌ పొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన సీదిరి అప్పలరాజుసైతం అనూహ్యంగా కేబినెట్‌లో చోటు సంపాదించారు. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ల చైర్మన్‌ కేటాయింపులోనూ సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం 56బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటిస్తే.. అందులో ఏడు కార్పొరేషన్లు శ్రీకాకుళం జిల్లాకే దక్కాయి. ఈ విషయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ చక్రం తిప్పారనే చర్చ జరుగుతోంది. బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు అయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ముగ్గురు సైతం కృష్ణదాస్‌ నియోజకవర్గం నరసన్నపేటకు చెందినవారే. దీనిపై జిల్లా పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇక చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీసీ కార్పొరేషన్ల విషయంలో వేసిన ఎత్తుగడ ప్రత్యర్థి పార్టీల కంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలలోనే గుబులు మొదలైందని టాక్‌. జిల్లాకు వచ్చిన వన్నియకుల క్షత్రియ, పాలేకిరి, ఈడిగ, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు పెద్దిరెడ్డి అనుచరులకే దక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news