ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం కొత్త రెండు ఫ్రొంఛైజీలు రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ ఫ్రొంఛైజీలు ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి సారి పాల్గొననున్నాయి. అయితే లక్నో ఫ్రొంఛైజీ పేరు.. సోమవారం రాత్రి ఆ ఫ్రొంఛైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించారు. లక్నో సూపర్ జాయింట్స్ అనే పేరును ఖరారు చేసినట్టు ప్రకటించారు. కాగ లక్నోఫ్రొంఛైజీను ప్రముఖ వ్యాపార వేత్త సంజీవ్ గొయెంకా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగ తమ ఫ్రొంఛైజీ పేరు ప్రకటించిన తర్వాత.. అభిమానుల కోరిక మేరకే లక్నో సూపర్ జాయింట్స్ అనే పేరును ఫైనల్ చేసినట్టు ప్రకటించారు.
కాగ జనవరి 3 వ తేదీన లక్నో ఫ్రొంఛైజీకి పేరు పెట్టాలని ఆన్ లైన్ లో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వచ్చిన ఉత్తమ పేర్లను పరిశీలించి లక్నో సూపర్ జాయింట్స్ పేరు ను యాజమాన్యం ఫైనల్ చేసింది. కాగ లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ గా ఇప్పటికే కెఎల్ రాహుల్ ను యాజమాన్యం రూ. 17 కోట్లు వెచ్చించి ఎంచుకుంది. అలాగే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను రూ. 9.2 కోట్లకు సొంతం చేసుకుంఇ. అలాగే ఇండియా కు చెందిన ఆన్ క్యాప్డ్ ప్లేయర్ రవి బిష్ణోయ్ ను రూ. 4 కోట్లకు తీసుకుంది.