చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి అద్భుతమైన ప్లేట్ ఫామ్ ను వేసుకుంది. ఈ రోజు తనకు ఎంతో కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారా.. ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. చెన్నై లో ఋతురాజ్ (79) , కాన్ వే (87) లు రాణించడంతో నిర్ణీత ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు చెన్నై ను ఏ దశలోనూ అడ్డుకోలేకపోయారు. ఒక్క చేత సకారియా మాత్రమే పది కి లోపు ఎకానమీ ని కలిగి ఉన్నాడు. మిగిలిన బౌలర్లు అందరూ పదికి పైగానే పరుగులు ఇచ్చుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ కి ఇంత భారీ స్కోరును ఛేదించడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.
ఎందుకంటే చెన్నై బౌలింగ్ మరియు ఎంతో చాకచక్యం కలిగిన ధోని కెప్టెన్సీ ముందు ఈ మ్యాచ్ ను గెలవడం వార్నర్ సేనకు అంత ఈజీ కాదు. ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుంది అన్నది ఒక్కటే తేడా… విజయం మాత్రమే ఖాయం. దీనితో ఈ మ్యాచ్ లో గెలిస్తే 17 పాయింట్ లతో ప్లే ఆఫ్ లో రెండవ స్థానానికి చేరుకుంటుంది.