ఐపీఎల్ 2023 లో కుర్రాళ్ళు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే యశస్వి జైస్వాల్ (124), వెంకటేష్ అయ్యర్ (104), సూర్యకుమార్ యాదవ్ (103), ప్రభు సిమ్రాన్ సింగ్ (103), హరీ బ్రూక్ (100) లు సెంచరీలు సాధించగా , తాజాగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ శుబ్ మాన్ గిల్ కేవలం 58 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్ కెరీర్ లోనే మొదటి సెంచరీని సాధించాడు. ఈ సెంచరీపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. కోహ్లీ తన మాటలలో “ఏదైనా సాధ్యం అయిందంటే అక్కడ గిల్ తప్పకుండా ఉంటాడు. మీరు మీ ఆటను ఇలాగే కొనసాగించండి. మీ ముందు తరాలను నడిపించండి .. గాడ్ బ్లెస్ యు గిల్ అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు.
కాగా ఇప్పటి వరకు కుర్రాళ్ళు మాత్రమే సెంచరీలు చేశారు. సీనియర్ క్రికెటర్ లు ఎవరూ సెంచరీ చేయకపోగా ధావన్ మాత్రం 99 పరుగులు చేసి సెంచరీని మిస్ అయ్యాడు.