చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకురాదు – సీఎం జగన్

-

నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబానికి సహాయంగా రూ. 10 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు సీఎం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలన్నారు. మత్స్యకారులకు డిజిల్ సబ్సిడీ లీటర్ కు రూ. 9 ఇస్తున్నట్లు వివరించారు.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ప్రభుత్వం అరకొర సాయం అందించిందని.. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో చంద్రబాబు ₹4,000 ఇచ్చారని.. అది కూడా కొందరికి మాత్రమే అందిందన్నారు. తాను ప్రజలను నమ్ముకున్నానని.. చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, కుట్రలు, కుయుక్తులు, మోసాలను నమ్ముకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news