ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ మరియు ముంబై జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంతకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఆ మ్యాచ్ లో రోహిత్ సేన 177 పరుగులు చేయగా , బదులుగా గుజరాత్ టైటాన్స్ మరో అయిదు పరుగులకు దూరంలో నిలిచిపోయి ఓటమి పాలయింది. మరి ఈ మ్యాచ్ లో అయినా ఐపీఎల్ లో గుజరాత్ ముంబై ని ఓడిస్తుందా చూడాలి.
కాగా ముంబై ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది. మొదట్లో వరుసగా మ్యాచ్ లు ఓడినా ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచి ఊపందుకున్నారు. ముంబై లో మరోసారి రోహిత్ , ఇషాన్ కిషన్ , గ్రీన్ మరియు సూర్యలు కీలకం కానున్నారు.