తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2023కు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14, 15, 17వ తేదీల్లో ఈ పరీక్షలను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ప్రాథమిక కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్చి 27వ తేదీ లోపు అభ్యర్థులు పంపాలని కోరిన విషయం తెలిసిందే.
telanganaset.org వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. సబ్జెక్ట్ ల వారీగా ఎంత మంది అర్హత సాధించారు. కట్ ఆఫ్ వివరాలను వెబ్ సైట్లో పెట్టారు అధికారులు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, బర్త్ డే డేట్ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందవచ్చు. యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల అర్హత కోసం మార్చి29న పరీక్షలు జరిగాయి. మొత్తం 29 సబ్జెక్టుల్లో జరిగిన ఈ పరీక్షకు 50, 256 మంది దరఖాస్తు చేసుకోగా 40, 128 మంది హాజరయ్యారు. 2,857 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షకు 80 శాతం హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.