ఐపీఎల్ 2023: సన్ రైజర్స్ VS లక్నో సూపర్ జెయింట్స్.. గెలిస్తేనే ముందుకు !

-

నేడు ఐపీఎల్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరగనున్న మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైద్రాబాద్ మరియు లక్నో సూపర్ జయింట్స్ లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైద్రాబాద్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో ఉంది. కాగా మిగిలిన నాలుగు మ్యాచ్ లలో భారీ తేడాతో గెలిస్తే ఛాన్సెస్ ఉండచ్చని క్రికెట్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ సైతం రాహుల్ గాయం తో దూరం అయినప్పటి నుండి ఓటముల బాటలో ఉంది.

కాగా లక్నో ఇప్పుడు 11 మ్యాచ్ లలో 5 గెలిచి అయిదవ స్థానంలో నిలిచి ఉంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ లలో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ కు ఛాన్సెస్ ఉంటాయి లేదంటే అంతే సంగతులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news