ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి మ్యాచ్ ను ఈ రోజు ఆడి సీజన్ ను ఓటమితో ముగించింది. చెన్నై చేతిలో పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ద్వారా చెన్నై మాత్రం దర్జాగా ప్లే ఆఫ్ కు చేరగా, ఢిల్లీ ఈ సొంత మైదానంలోనే అభిమానుల ముంగిట సీజన్ ను చాలా బాధతో ముగించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ .. ఏ దశలోనూ గెలిచేలా కన్పించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. ఈ సీజన్ లో ఢిల్లీ నుండి ఒక్క వార్నర్ మినహాయియించి ఏ ఒక్కరూ గొప్పగా ఆడింది లేదు. కానీ పేర్లకు మాత్రమే జట్టు నిండా పెద్ద పెద్ద ఆటగాళ్లు. వార్నర్ ఒక్కడే ఈ మ్యాచ్ లో 86 పరుగులు చేసి ఓటమి బాధను కొంతైనా తగ్గించగలిగాడు.
ఢిల్లీ ని దీపక్ చాహర్ తనదైన స్వింగ్ బౌలింగ్ తో సరైన దెబ్బ కొట్టాడు. ఇతను కీలక వికెట్లను తీసి ఢిల్లీని కోలుకుకోకుండా చేశాడు. చివరికి వార్నర్ ఆడిన గ్రేట్ ఇన్నిన్స్ కాస్త బూడిదలో పోసిన పనీరులా మారింది.