IPL 2025 postponed indefinitely: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఐపీఎల్ తిరిగి నిర్వహించే ఛాన్స్ ఉంది.

కాగా, పాక్ దాడుల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. పాక్, ఇండియా వార్ ప్రభావం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్‌పై పడింది. జమ్మూ ఎయిర్ పోర్టుపై పాక్ దాడి చేయడంతో అప్రమత్తమైన సైన్యం ధర్మశాలలోనూ బ్లాక్ అవుట్ ప్రకటించింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫ్లడ్ లైట్స్ బంద్ కావడంతో సగంలోనే మ్యాచ్ నిలిచిపోయింది.