కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2020 టోర్నీని దుబాయ్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు టోర్నీ దుబాయ్‌లో జరుగుతుంది. నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ ఉంటుంది. అయితే టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాగా మరో 3 రోజుల్లో.. అంటే.. ఆగస్టు 1న ఆ షెడ్యూల్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఆగస్టు 1న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అందులోనే ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ సమావేశంలో అన్ని విషయాలను ఐపీఎల్ యాజమాన్యం చర్చింనుంది. ఫ్రాంచైజీల సలహాలు, సూచనలను పరగిణనలోకి తీసుకోనుంది. అనంతరం టోర్నీ షెడ్యూల్‌ను ఫైనలైజ్ చేసి ప్రకటిస్తారు. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వివరాలను ఫ్రాంచైజీలకు తెలియజేస్తారు.
అయితే ఈ సారి టోర్నీ దుబాయ్‌లో జరుగుతున్నా.. కరోనా ఉన్నప్పటికీ.. మ్యాచ్‌లను మాత్రం కుదించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా గత ఐపీఎల్ టోర్నీల్లో వారాంతాల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లను నిర్వహించేవారు. కానీ ఈసారి అలా ఉండబోవడం లేదని తెలుస్తోంది. అలాగే 2 నెలల పాటు ప్లేయర్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు కనుక.. వారిని ప్లేయర్ల వద్దకు అనుమతించాలా, వద్దా.. అనే విషయాలపై కూడా సదరు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.