ఐపీఎల్ మీడియా రైట్స్.. ఎవరు కొన్నారో తెలుసా?

-

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఐపీఎల్ మ్యాచ్‌తో పాటు దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా లేదు. సోమవారం ముంబై వేదికగా బీసీసీఐ నిర్వహించిన వేలంలో భారీ రికార్డు స్థాయిలో వేలం నమోదైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, సోనీ, స్టార్ తదితర కంపెనీలు భారీ ఎత్తున పోటీ పడ్డాయి. దాదాపు రూ.44,075 కోట్లకు హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఐపీఎల్ మీడియా రైట్స్
ఐపీఎల్ మీడియా రైట్స్

ప్యాకేజీ-ఏలో టీవీ హక్కులు, ప్యాకేజీ-బీలో డిజిటల్ హక్కులను బీసీసీఐ అమ్మకానికి వేలం పెట్టింది. వీటిలో ప్యాకేజీ-ఏ అంటే టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. అలాగే భారత ఉపఖండం వరకు డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్ 18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకుంది. దీంతో రెండు హక్కులను మొత్తంగా రూ.44,075 కోట్లకు కొనుగోలు చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. 2023-27 వరకు ఈ వేలంలో రెండు ప్యాకేజీలకు వేలం నిర్వహించినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో ఐపీఎల్ వచ్చే సీజన్‌లో ప్రతి మ్యాచ్ విలువ రూ.107.5 కోట్లకు నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news