IPL2023: మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది – భువనేశ్వర్

-

ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ తమ హోమ్ గ్రౌండ్ అయినా ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించనున్నారు. SRH జెట్టుతో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా సిద్ధమైంది. యువ ప్లేయర్ సంజు సాంసంన్ సారధ్యంలో బెస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ టీం తో రానుంది.

ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ పటిష్టమైన బౌలింగ్ యూనిట్ తో, సరికొత్త టీం తో ఈ సీజన్ లో అడుగుపెడుతుందని తెలిపారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ భువనేశ్వర్ కుమార్. కెప్టెన్ల విషయంలో ప్రతి సీజన్ లో కొంత తడబాటు ఉండేదని.. మార్క్రం కెప్టెన్సీ తో SRH కి అదనపు బలం వచ్చిందన్నారు. అలాగే యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తో మా బౌలింగ్ స్ట్రెంత్ పెరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news