ఇరాన్ తాజాగా చాబర్ రైల్వే లేన్ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను తప్పించింది. ఒప్పందం జరిగి నాలుగేళ్లు గడుస్తోన్నా ప్రాజెక్టు ప్రారంభానికి భారత్ నిధులు ఇవ్వడం లేదని, దీంతో ఈ రైలు మార్గాన్ని తామే సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఈ రైల్వే లేన్‌ను చాబర్ పోర్టు నుంచి అప్ఘానిస్థాన్ సరిహద్దుల వెంబడి జహేదాన్ వరకు నిర్మించనున్నారు. అమెరికా ఆంక్షలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌కు పెట్టుబడుల ఎర వేసిన డ్రాగన్.. ఆ దేశాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకుంది.
ఫలితంగా మన దేశ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. మార్చి 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ సహకారం లేకుండానే ఇరాన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టును చేపడతాయని.. దాదాపు 400 మిలియన్ డాలర్లను ఇరానియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి కేటాయిస్తారని సమాచారం.