ఈ IRCTC తిరుమల టూర్ ప్యాకేజీతో.. శ్రీవారి దర్శనం.. ఈ ప్రదేశాలని కూడా చూసి వచ్చేయచ్చు..!..!

-

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈ వేసవి లో మీరు తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… ఒక్క రోజులోనే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ స్పెషల్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వచ్చిన ఈ ప్యాకేజీ పేరు డివైన్ బాలాజీ దర్శన్. భక్తులు ఒక్కరోజులోనే తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని రావచ్చు. ఈ ప్యాకేజీ తో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే వాళ్లకి ఈ ప్యాకేజీ ని తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ధర వచ్చేసి రూ.990. ఐఆర్‌సీటీసీ డివైన్ బాలాజీ దర్శన్ ప్యాకేజీ పూర్తి వివరాలు చూస్తే… రైలు దిగి, నాలుగు గంటల్లో శ్రీవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఈ ప్యాకేజీ తో ట్రైన్ ఎక్కేయచ్చు. ఉదయం 8.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఈ టూర్ ప్యాకేజీ స్టార్ట్ అవుతుంది. తిరుపతికి వచ్చిన తర్వాతే ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ లో రైలు టికెట్లు ఉండవు. భక్తులే టికెట్లు తీసుకోవాల్సి వుంది.

రైల్వే స్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కౌంటర్ దగ్గర భక్తుల్ని రిసీవ్ చేసుకుని.. తిరుమల బయల్దేరాలి. తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనం అయ్యాక తిరుపతి బయల్దేరాలి. రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. అదే చుట్టూ వుండే ఆలయాలని చూడాలనుకుంటే పంచదేవాలయం పేరుతో వుండే ప్యాకేజీ ని బుక్ చెయ్యచ్చు. అప్పుడు కాణిపాకం, తిరుచానూర్, తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం కవర్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news