ఐపీఎల్ 2023:లక్నో చేతిలో ముంబై ఓటమి… ప్లే ఆఫ్ కు అడ్డంకిగా మారేనా !

-

గత రాత్రి ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ లు చివరి బంతి వరకు హోరాహోరీగా తలపడగా, అనూహ్యంగా ముంబై గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో గెలిచి సంచలనం సృష్టించింది. మొదటాగ్ టాస్ గెలిచినా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా… బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్ లో స్టాయినిస్ ఈ సీజన్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 47 బంతుల్లో 4 ఫోర్లు మరియు 8 సిక్సులతో 89 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో ముంబై చివరి బంతి వరకు పోరాడి అయిదు పరుగుల తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్ కు చేరకుండా అభిమానులను టెన్షన్ పెట్టింది. చివరి ఓవర్ లో పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో ప్రమాదకర డేవిడ్ మరియు గ్రీన్ లు ఉన్నారు.. అయినా లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం అయిదు పరుగులు మాత్రమే ఇచ్చి లక్నో ను గెలిపించాడు.

దీనితో ముంబై కు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.. ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. లేదంటే కష్టమే… ఇక ముంబై తన చివరి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news