మత మార్పిడి వ్యతిరేక చట్టం అవసరమా?: నితీష్ కుమార్

-

ఇటీవల దేశంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. దేశంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం అవసరం లేదన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జేడీయూ ప్రభుత్వం అన్ని మతాలకు సమన్యాయం చేస్తుందన్నారు. అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం అవసరం లేదన్నారు.

సీఎం నితీష్ కుమార్
సీఎం నితీష్ కుమార్

కాగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలని అంటున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్‌కు బీజేపీ మధ్య దూరం పెరిగిందనే ప్రచారం వినిపిస్తోంది. కుల గణన విషయంలో ఇరు పార్టీల తీరు విభిన్నంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే, అయోధ్య కేసు, ఆర్టికల్ 370, తలాక్, ఎన్ఆర్‌సీ, ఉమ్మడి పౌరస్మృతి, జనాభా నియంత్రణ వంటి అంశాల అమలుపై కూడా బీజేపీ తీరును నితీష్ కుమార్ వ్యతిరేకించారు.

Read more RELATED
Recommended to you

Latest news