ముద్ర యోజన కింద 4,500 కడితే పది లక్షలు లోన్… నిజమెంత…?

-

తరచు మనకి ఏదో ఒక ఫేక్ వార్త కనబడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కి అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటోంది. దీంతో చాలా మంది మోసపోతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి.

స్కీమ్స్ అని, జాబ్స్ అని చాలా నకిలీ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా..? నిజంగా ఆ లోన్ ని కేంద్రం ఇస్తోంది లేదా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. పీఎం ముద్ర యోజన కింద రూ. 4,500 చెల్లిస్తే 10 లక్షల లోన్ ని కేంద్రం ఇస్తోందని ఒక వార్త వచ్చింది.

ఈ నాలుగు వేల ఐదు వందలు కూడా వెరిఫికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు అని అందులో ఉంది. అయితే ఇందులో నిజం ఎంత..? 4500 రూపాయలు చెల్లించ వచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. లోన్ అప్రూవల్ చేసిన లెటర్ నకిలీది.

కేంద్రం ఇలాంటి లెటర్ ని ఏమి తీసుకు రాలేదు. ఇది కేవలం వట్టి ఫేక్ వార్త. నమ్మరు అంటే అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరికీ నకిలీ వార్తలను ఫార్వర్డ్ చేయకండి.

 

Read more RELATED
Recommended to you

Latest news