వాస్తు ప్రకారం కుక్కను పెంచుకోవడం మంచిదా కాదా..?

-

ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఈరోజుల్లో చాలా కామన్‌ అయిపోయింది. కుక్కలను, పిల్లలును చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కను పెంచుకోవడం కుటుంబసభ్యుల ఇష్టం, వాళ్ల హాబీ మాత్రమే కాదు. వాస్తుకు కుక్కను పెంచుకోవడానికి సంబంధం ఉంటుందట. ఇదేక్కడి లింక్‌రా అనుకుంటున్నారా..? వాస్తు పరంగా కూడా కుక్కను పెంచుకోవడం వల్ల కొంత లాభం ఉంటుందట. ప్రతి ఇంటికి వాస్తు చాలా ముఖ్యమైనది. మనం పెంచే జంతువులకు కూడా వాస్తు సంబంధం ఉంది. ఇంట్లో కుక్కను పెంచుకోవడం శుభప్రదం. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ కుక్కకు ఆహారం ఇస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. దీంతో శని దోషం తొలగిపోతుంది.

సంతానలేమితో బాధపడుతున్న జంట ఇంటిలో కుక్కను పెంచుకుంటే.. త్వరలో సంతానం కలుగుతుందట.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే కుక్కను చూడటం శుభప్రదం. అలాంటి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. చాలా అనుగ్రహం ఉంటుంది.

వాస్తు ప్రకారం, మీరు నల్ల కుక్కను పెంచితే.. అది రాహు, కేతు మరియు శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కుక్కను పెంచుకోవడం వల్ల టైమ్‌పాస్‌, ఆనందం మాత్రమే వస్తుంది అనుకున్నాం కానీ ఇలాంటి బెనిఫిట్స్‌ కూడా ఉంటాయని ఎప్పుడూ విని ఉండరు కదా..! పాజిటివ్‌ ఎనర్జీ , నెగిటివ్‌ ఎనర్జీ అని రెండు ఉంటాయి. మనలో పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే.. మనసుకు నచ్చిన పనులు చేయాలి, చూసే చూపు, చేసే పని, మాట్లాడే మాట ఇవన్నీ పాజిటివ్‌గా ఉంచుకోవడమే వాస్తు. వాస్తు నియమాలను పాటించే వాళ్లకు వీటిపై బాగా అవగాహన ఉంటుంది. ఇంతకీ మీరు కూడా ఇంట్లో కుక్కను పెంచుతున్నారా..?

Read more RELATED
Recommended to you

Latest news