ఇంట్లో శంఖం ఉంచడం మంచిదేనా..? ఎలాంటి శంఖం సంపదకు చిహ్నం..?

-

హిందూ పురాణాల్లో మన సంసృతి సంప్రదాయం గురించి వివరంగా ఉంది..ఇల్లు ఎలా ఉండాలి.. ఇల్లాలు ఎలా ఉండాలి.. ఇంట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు ఇవన్నీ… మనం ఎక్కడికైనా వెళ్తే.. అక్కడి వస్తువులు నచ్చితే.. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం.. కానీ కొన్ని ఇంట్లో పెట్టకూడనివి కొన్ని ఉంటాయి.. మీరు ముద్దుగా ఉన్నాయి కదా అని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అనవసరమైన పంచాయితీ..మీరు చూసే ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో శంఖువు ఉంటుంది. ఇంటిలో శంఖం ఉండ‌డాన్ని అదృష్టంగా భావిస్తారు. హిందూ సాంప్ర‌దాయంలో ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు శంఖాన్ని మోగిస్తారు.

Suresh 🇮🇳 on Twitter: "Blowing the Conch is Sanghi and Hindu Superstition. Today, Nature is telling Humans to blow into Spirometer to improve lung capacity. https://t.co/MsI7xfxI7A" / Twitter

శంఖంలో దేవ‌త‌లు ఉంటార‌నేది ఒక న‌మ్మ‌కం. శంఖం ముందు భాగంలో గంగ, స‌ర‌స్వ‌తిలు ఉంటార‌ని, మ‌ధ్య భాగంలో వ‌రుణ దేవుడు, వెనుక భాగంలో బ్ర‌హ్మ ఉంటార‌ని భావిస్తారు. శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఇంట్లో శంఖాన్ని ఉంచితే ఏం అవుతుంది..?

ఇంట్లో శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొల‌గడ‌మే కాకుండా, సిరి సంప‌ద‌లు, ఆరోగ్యం క‌లుగుతాయి.
ఇంట్లో ఎక్క‌డైతే వాస్తు దోషం ఉంటుందో ఆ మూల‌కి శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది.
శంఖాల‌ల్లో మూడు ర‌కాలు ఉంటాయి. అవి ద‌క్షిణావృత్తి శంఖం, మ‌ధ్యవృత్తి శంఖం, వామవృత్తి శంఖం.
ఇంట్లో శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.
మాన‌సిక ఒత్తిడిని త‌గ్గిస్తుంది.
హైబీపీ ఉన్న వాళ్లు శంఖాన్ని మోగించ‌డం ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భించ‌డ‌మే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల‌ పొట్టకు వ్యాయామం క‌లిగి గ్యాస్‌ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
ఇలా శంఖువుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

శంఖాన్ని ఏం చేత్తో పట్టుకోవాలి..?

కుడి చేత్తో ప‌ట్టుకునే శంఖాన్ని ద‌క్షిణావృత్తి శంఖం అంటారు. మ‌ధ్య భాగంలో తెరిచి ఉండే శంఖాన్ని మ‌ధ్య‌వృత్తి శంఖం అంటారు. ఎడ‌మ చేత్తో ప‌ట్టుకునే శంఖాన్ని వామ‌వృత్తి శంఖం అంటారు. ద‌క్షిణావృత్తి శంఖాన్ని ల‌క్ష్మి స్వ‌రూపంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల సంప‌ద క‌లుగుతుంద‌ని భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news