ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి కేసులు.. క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు 15 వేలకు పైగా నమోదు అయిన కరోనా మహమ్మారి కేసులు.. ఇప్పుడు 11 వేలకు తగ్గాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 11573 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కడప జిల్లాలో ఏకంగా ఇవాళ ఒక్క రోజే అత్యధికంగా.. 1942 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 594 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9445 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40, 357 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,39 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.