సెకండ్ వేవ్ కరోనా ఉధృతిలో చాలా రకాల లక్షణాలతో కరోనా మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గతంలో లేని కొత్త లక్షణాలను వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ఇది వైరస్ మ్యూటేషన్‌లో భాగమే! ఇది ప్రాణాంతకం కూడా అవుతోంది.గతంలో కరోనా లక్షణంలో భాగంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యేవి. అలాగే పొడిదగ్గు, వాసన కోల్పోవడం, ముక్కు బ్లాక్ అవ్వడం కూడా కరోనా లక్షణమే. తాజాగా కొన్ని వైద్య నిపుణులు కొత్త లక్షణాన్ని గుర్తించారు.
ఆస్పత్రిలో అడ్మిడ్ అయిన కరోనా బాధితులు కొత్తగా ముక్కులో మంటగా కూడా ఉందని గుర్తించారు. సాధారణంగా ముక్కులో మంటగా ఉండటం కరోనా లక్షణం కాదు. కానీ, కొంత మంది కొవిడ్ బాధితుల్లో వారికి పాజిటివ్ ధ్రువీకరణ అయ్యేముందు ఇలా ముక్కు మంటగా ఉండేదని తెలిపారు. క్లినికల్ స్టడీస్ ప్రకారం ముక్కులో మంట, బ్లాక్ అవ్వడం, శ్వాసకు ఇబ్బంది కలగటం అన్ని కూడా కరోనా వచ్చిన రోగుల్లో సర్వసాధారణం. ముక్కులో ఈ ఇన్ఫెక్షన్‌కి కారణం ముక్కులో బ్యాక్టిరియా లేదా ఫంగస్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడమే కారణం.
ఇది ఆందోళనకరమైనదా?
ఇప్పటి వరకు ముక్కులో ఈ విధంగా మంట పుట్టడం వల్ల ప్రాణాంతకమైన కేసులను గుర్తించలేదు. కొన్ని కేస్ స్డడీస్ ప్రకారం కొవిడ్ రోగుల్లో సైనస్ బ్లాక్ అయ్యి దురద, ముక్కులో డ్రైగా ఉండటం, ఇర్రిటేషన్ ఫీలింగ్ లక్షణాలుగా నిర్ధారణ అయింది. ఇది గొంతులోకి కూడా వ్యాపిస్తుంది. కళ్లలోకి వ్యాపించి కళ్లు కూడా దురదగా, నీళ్లు కారడం వంటివి జరిగాయి. ఎవరికైనా జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, వాసన తెలియక పోవడంతోపాటు ముక్కులో మంటగా ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించాలి. గొంతు ఎండిపోవడం, కళ్లలో నుంచి నీరు కారడం, డయేరియా లక్షణాలు ఉన్నా వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. ఫోన్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించి లక్షణాలను తెలియజేయాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు వివిధ వ్యక్తుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. తలనొప్పి, రుచి కోల్పోవడం కూడా కరోనా లక్షణాలే! కానీ, డాక్టర్‌ను సంప్రదించనిదే మీకు మీరే ఎటువంటి నిర్ధారణకు రావద్దు.