ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇలా మరణించడానికి గల కారణం పావురాల నుంచి వెలువడిన వ్యర్థాలు గాలిలో కలిసి ఆ చెడు వాయులను తరచూ పీల్చడం వల్ల విద్యాసాగర్ మరణించాడు అని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే నిజంగానే విద్యాసాగర్ మరణించడానికి అసలు కారణం పావురాలు అని చెప్పిన వైద్యులు.. పావురాల పెంపకం చేపట్టే వారికి కూడా అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక పావురాల పెంపకం తో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఒకప్పుడు పావురాలను సందేశాలను చేరవేసే వాహకాలుగా పరిగణించేవారు. గతంలో టెలిగ్రాం, టెలిఫోన్ వంటి సదుపాయం లేని రోజుల్లో పావురాలే ఉత్తరాలను ఒక చోట నుంచి మరొక చోటుకు చేరవేసేవి. అందుకే అప్పట్లో వీటి పెంపకం విరివిగా ఉండేదని చెప్పవచ్చు. ఇకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు పావురాలు ఉండే ప్రదేశానికి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. పావురాలు ఎందుకు అంత ప్రమాదకరము అంటే.. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లేదా బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ .. ఇది ఊపిరితిత్తులకు వచ్చే అలర్జీ లాంటిది. పావురాలు వదిలే రెట్టల వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా దీని లక్షణాలు న్యుమోనియాకు దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలామంది వైద్యులు అయోమయంలో ఉన్నారనే చెప్పాలి.
ముఖ్యంగా ఈ అలర్జీల వల్ల దగ్గు , కీళ్ల నొప్పులు , శ్వాస ఆడకపోవడం, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పావురాలు మూత్రం, మలం రెండు కలిపి ఒకేసారి విచార్జిస్తాయి కాబట్టి ఇవి అత్యంత ప్రమాదకరం. ఇక ఇది ఎండిపోయాక చిన్న చిన్న కణాలు గాలిలో కలిసిపోతాయని తద్వారా ఊపిరి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాటికి గింజలు వేయడానికి వెళ్లిన వారికి శ్వాస ద్వారా విసర్జిత కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు, రోగాలు ఉన్నవారు , కోవిడ్ వచ్చి తగ్గిన వారు కూడా పావురాలు ఉండే ప్రదేశానికి వెళ్లకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.