ఆ వెధవ పని చేసింది చంద్రబాబు కాదా..?

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే నీలి నీడలు కమ్ముకున్నాయి. అమరావతిని తరలించడం దాదాపుగా ఖాయమైంది. కేవలం ఇక్కడ శాసన రాజధాని మాత్రమే ఉండను౦ది. దీనితో రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా మార్చవద్దని డిమాండ్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వినపడుతుంది. ఇక ఇప్పుడు సచివాలయాన్ని తరలిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో రాజధాని తరలింపు అంశంపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రాజధాని తరలింపు ఇంత తొందరగా సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. జరుగుతున్న ప్రచారం కారణంగా ఉద్యోగుల్లో కలవరం మొదలైందని, ఇప్పట్లో రాజధాని తరలింపు జరగనే జరగదని ఆయన వ్యాఖ్యానించారు. అకడమిక్ ఇయర్ మధ్యలో రాజధాని తరలింపు జరగదని,

రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకముందని, రాజధాని తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఉద్యోగులను భయపెట్టిన చరిత్ర చంద్రబాబుదన్న ఆయన చంద్రబాబు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని… అసలు రాజధాని అమరావతిలో పెట్టడం సమంజసమేనా..? ప్రశ్నించిన ఆయన, మునిగిపోతుందని తెలిసీ రాజధాని నగర నిర్మాణం చేపట్టే వెధవ పని చేసింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news