మాత్రలు ప్రాణాలు పోయాలి కానీ..ప్రాణంతీస్తే.. ఇంగ్లీష్ మందుల అతి వాడకం ప్రమాదకరమే.. కానీ ఇంతలానా..?గాంబీయాలో 66 మంది పిల్లల మరణించారు. ఇందుకు కారణం..ఔషదాల తయారీ విషయంలో మన సంస్థలు ఎంత నిర్లక్ష్యమే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దయవల్ల ఈ విషయం బయటకు వచ్చింది..గాంబీయాలో పిల్లల మరణానికి కారణమైన ఆ దగ్గు మందులో ఏముంది? ఎందుకలా జరిగిందంటే..
మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైనా నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు పిల్లల మరణాలకు కారణం అయ్యాయి.. ఈ బైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.
హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ మందులు విషపూరితమని తెలిపింది.. ఆ నాలుగు మందులు పిల్లల దగ్గు, జలుబుకు వాడే సిరప్లు. వీటిలో ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఉన్నాయి.
మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో తయారైన ఈ ఉత్పత్తుల్లో డైఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. దాదాపుగా 23 నమూనాలలో ఈ నాలుగు డైఇథలిన్ గ్లైకాల్ లేదా ఇథలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా తేలింది.
డైఇథలీన్ గ్లైకాల్ అంటే ఏంటి..?
డై ఇథలిన్ గ్లైకాల్ విషపూరితమైంది. దీన్నీ వాడినపుడు కిడ్నీ, నాడీ మండలంపై ప్రభావం చూపుతుంది. ఈ రసాయనాన్ని మందులలో ఉపయోగించినపుడు మాస్ పాయిజనింగ్ జరిగినట్టు ఇది వరకు కూడా తేలింది. డై ఇథలిన్ రుచి తియ్యగా ఉంటుంది. ఎటువంటి వాసన, రంగు లేని హైగ్రోస్కోపిక్ ద్రవం. ఇది నీరు, ఆల్కహాల్, ఈథర్, అసిటోసిన్, ఇథిలిన్ గ్లైకాల్లో బాగా కలిసిపోతుంది.
డైఇథలిన్ గ్లైకాల్ తీసుకున్నపుడు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రవిసర్జనలో సమస్యలు, తలనొప్పి, ఒక్కోసారి మతి బ్రమణం కలుగవచ్చు. కిడ్నీలకు తీరని నష్టం కూడా జరగవచ్చు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సమర్పించిన పేపర్ ప్రకారం.. 70 సంవత్సరాలలో చాలా సార్లు డై ఇథలిన్ గ్లైకాల్ వల్ల మాస్ పాయిజనింగ్ మరణాలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఇది మందుల తయారీకి ఉపయోగించడం సురక్షితమే. కానీ దీన్ని డైల్యూటెడ్ ఫాంలో ఫార్మాస్యూటికల్ గ్రేడ్ గ్లిజరిన్ మాదిరిగా వాడాల్సి ఉంటుంది.