కృష్ణంరాజు చివరి కోరిక అదేనా.?

-

రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు 1966లో చిలకా గోరింక అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో చిత్రాలలో నటించారు. ముఖ్యంగా భక్త కన్నప్ప, బావ బామ్మర్ది , బొబ్బిలి బ్రహ్మన్న, అమ్మానాన్న , మంచికి మారుపేరు , కురుక్షేత్రం, గీతా సంగీత ,మహానుభావుడు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి , రాముడు, ప్రేమ తరంగాలు , పులిబిడ్డ, అగ్నిపూలు, టాక్సీ డ్రైవర్ , తాండ్ర పాపారాయుడు , నేటి సిద్ధార్థ , యమధర్మరాజు ఇలా ఎన్నో చిత్రాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన కన్నడలో కూడా రెండు సినిమాలలో నటించాడు. ఇక అలా 185 చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

1980 సంవత్సరం వరకు సినిమాలలో నటించిన కృష్ణంరాజు ఆ తర్వాత బిజెపి పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన కృష్ణంరాజు ఆ తర్వాత పార్టీని వీడి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ఇక రాజమండ్రి నుండి లోక్సభకు పోటీ చేయగా అక్కడ ఓడిపోవడం జరిగింది . ఇక తర్వాత రాజకీయాలలోకి వెళ్లకుండా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తన కొడుకుతో కలిసి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. ఇక కృష్ణంరాజు చివరిసారిగా నటించిన చిత్రం రాధే శ్యామ్ . ఆయన నటించిన చివరి చిత్రం అలాగే పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

ఇకపోతే కృష్ణంరాజు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు ఉదయం 3:25 గంటలకు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన తన చివరి కోరికను తీర్చుకోకుండానే మరణించడం చాలా బాధాకరమని చెప్పాలి. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని, సంబంధం చూస్తున్నామని, అమ్మాయి గురించి త్వరలోనే వెల్లడిస్తామని ఎన్నోసార్లు మీడియాతో వెల్లడించిన కృష్ణంరాజు .. ఇలా ప్రభాస్ కి పెళ్లి చేయకుండానే మరణించడంతో ఆయన ఆత్మ మరింత ఘోష పడుతుంది అని పలువురు అభిమానులు తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని.. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news