కృష్ణ రాజకీయాలకు దూరం కావడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ ఒక నటుడుగా కాకుండా, నిర్మాతగా, దర్శకుడుగా, రాజకీయ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. సినిమాల నుంచి పొలిటికల్స్ వరకు అన్నిచోట్ల చాలా డేరింగ్ గా ఉండేవారు కృష్ణ. రాజకీయాలలో తక్కువ కాలమే ఉన్నప్పటికీ అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు కృష్ణ. ఎంపీగా కూడా గెలిచారు. 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ సభ మద్దతు తెలియజేయడం జరిగింది కృష్ణ. ఇక ఆ తర్వాతే ఎన్టీఆర్ తదితర నటులు సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక అలాంటి సమయంలోనే కృష్ణ ఈనాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రమే తెలుగుదేశం పార్టీ విధానాలకు ప్లస్ అయిందని అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. దీంతో కృష్ణ ఎన్టీఆర్ కు కాస్త దగ్గరయ్యారు వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత పరిణామాలతో కృష్ణ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టడం జరిగిందట. అప్పుడే రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణల మధ్య స్నేహం కుదిరింది. అలా ఎన్టీఆర్ తన హవా కొనసాగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కృష్ణ ని పార్టీ కూడా చాలా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.

అయితే కృష్ణ ఎలాంటి సినిమా చేసిన సరే అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందట. 1889లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. కేవలం 16 నెలలు మాత్రమే ఎంపీగా కొనసాగారు. కానీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత రెండేళ్లకి మధ్యంతర ఎన్నికలు రావడంతో 1991లో జరిగిన ఎన్నికలలో ఓటమిపాలయ్యారు కృష్ణ. ఇక తర్వాత ఆ కుళ్ళు రాజకీయాలను చూసి తట్టుకోలేక రాజకీయాలకు సైతం దూరమయ్యారు కృష్ణ అని సమాచారం. కానీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కి మద్దతుగా ఉంటూ వైఎస్సార్ తో కూడా కృష్ణకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వాళ్ళ సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. చివరి వరకు కృష్ణ కాంగ్రెస్ లోనే కొనసాగారు.

Read more RELATED
Recommended to you

Latest news