తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఈయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మొట్టమొదటిసారి ఈస్ట్ వన్ కలర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఈయనదే. అలాగే హాలీవుడ్ రేంజ్ లో కౌబాయ్ సన్నివేశాలతో సినిమాలు తెరకెక్కించడం కృష్ణ తర్వాతే ఎవరైనా.. అంతలా తెలుగు సినీ పరిశ్రమకు తన వంతు సహాయం చేశారు.. అంతే కాదు పద్మాలయ స్టూడియో ద్వారా ఎన్నో చిత్రాలను కూడా నిర్మించారు కృష్ణ.
ఇలా ఎన్నో ఘనతలు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం తెల్లవారుజామున మరణించడం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. ఒక లెజెండ్రీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ మరణం ఒక్క సెలబ్రిటీలకే కాదు సినీ ప్రేక్షకులకు కూడా తీరనిలోటు అని చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే ఉన్న ఆయన కోడలు నమ్రత హుతాహుట్టిన హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. టాప్ డాక్టర్ల పర్యవేక్షణలో కృష్ణ గారికి చికిత్స జరిగింది. కానీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు అని వైద్యులు నిన్న సాయంత్రమే తేల్చి చెప్పారు.
అంతేకాదు మల్టీ ఆర్గాన్స్ కూడా పనిచేయకపోవడం వల్లే ఆయన మరణించాడు అని వైద్యులు తేల్చి చెప్పారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ మరణం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మహేష్ బాబుకి అయితే ఇదే సంవత్సరం మూడు షాక్ లు తగిలినట్టు అయిందని చెప్పాలి. కరోనా సమయంలో ఇదే ఏడాది తన అన్నయ్య రమేష్ బాబు మరణించగా సరిగ్గా నెల రోజుల క్రితం సెప్టెంబర్ 30వ తేదీన ఆయన తల్లి ఇందిరాదేవి కూడా మరణించారు. ఇప్పుడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడం చాలా బాధాకరమనే చెప్పాలి.