మనకి ఉండే ముఖ్యమైన అవయవాలలో లివర్ కూడా ఒకటి. లివర్ ఆరోగ్యం పై ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలి. లివర్ కి సంబంధించిన సమస్యలు వచ్చాయంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే లివర్ సమస్యలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి.
ఎందుకు అసలు లివర్ సమస్యలు వస్తాయి..?
లివర్ లో కనుక ఫ్యాట్ చేరుకుంది అంటే అప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీనికి గల కారణాలు చాలా వున్నాయి.
ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన సమస్య రావచ్చు. ఇది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటివి కూడా ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అనేది చూస్తే… టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, రక్తంలో అధిక స్థాయి కొవ్వులు మొదలైన వాటి వలన వస్తుంది.
ఈ సమస్య ఉంటే ఏం చెయ్యాలి..?
ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయట పడడం చాలా ముఖ్యం. వ్యాధి ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఈ సమస్య ఉంటే కాళ్ళు, పొత్తి కడుపు లో సమస్య తో పాటుగా మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఈ సమస్య ఉంటే నిరంతరం కొవ్వు పేరుకుపోవడం తో పాటూ అవయవ వాపు కలుగుతుంది. సరైన ట్రీట్మెంట్ లేదంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ కింద కూడా మారచ్చు.
నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ మూలంగా లివర్‌లోని అదనపు కొవ్వు కణాల వల్ల వాపు వస్తుంది.
ఈ సమస్య ఉంటే పొత్తి కడుపు లో వాపు కలగడం తో పాటు దీర్ఘకాలిక మంట కూడా కలగొచ్చు.
ఇతర లివర్ సమస్యలు, సిర్రోసిస్‌కి వంటివి వచ్చే రిస్క్ కూడా వుంది.
కానీ వట్టి కడుపులో వాపు ఉంటే లివర్ సమస్య ఉన్నట్టు కాదు. డాక్టర్ సలహా పాటిస్తే మంచిది.