IND VS WI: విండీస్ తో సిరీస్ కు కామెంటేటర్ గా ఇషాంత్ శర్మ…

-

ఇండియా ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో టెస్ట్, వన్ డే మరియు టీ 20 లు ఆడడానికి వారం రోజుల కిందటే వచ్చింది. ఇంకో రెండు రోజుల్లో మొదటి టెస్ట్ జరగనుండగా ఇరు జట్లు ప్రాక్టీవ్ లో మునిగి తేలుతున్నాయి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ గురించి ఒక కీలక వార్తను వెస్ట్ ఇండీస్ బోర్డు ప్రకటించింది. మాములుగా రెగ్యులర్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఇషాంత్ శర్మ.. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో ఆడేందుకు సెలెక్ట్ చేయలేదు. దీనితో మరో కొత్త అవతారంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇశాంత్ శర్మ. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ టెస్ట్ సిరీస్ కు కామెంటేటర్ గా మారనున్నాడట ఇషాంత్ శర్మ. ఈ విషయాన్నీ జియో సినిమా వెల్లడించింది.. కాగా వెస్ట్ ఇండీస్ పై ఇషాన్ శర్మకు ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన ఏకైక భారత్ బౌలర్ కావడం విశేషం.

కాగా ఇషాంత్ శర్మ ఇప్పటి వరకు టెస్ట్ కెరీర్ లో 105 టెస్ట్ లు ఆడగా 311 వికెట్లను తీసుకున్నాడు. ఇక 80 వన్ డే లు ఆడగా 115 వికెట్లను సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news