బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ( బిబిసి) పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదరులలో భాగంగా ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులు కూడా కార్యాలయాన్ని వదిలి త్వరగా ఇంటికి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై లలో ఉన్న కార్యాలయాలలో ఇవాళ ఐటీ శాఖ తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ టాక్సేషన్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లో అక్రమాలు జరిగినట్లు బిబిసి పై ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బిబిసి పై ఐటి శాఖ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బీబీసీపై ఐటీ దాడుల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తరువాత.. బిబిసి ఇండియా పై ఐటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఐటీ, సిబిఐ, ఈడి ఏజెన్సీలు బిజెపికి పెద్ద కీలుబొమ్మలుగా మారాయన్నారు. తర్వాత ఏంటి? హిండెన్ బర్గ్ పై ఈడీ దాడులు, లేక టేక్ ఓవర్ ప్రయత్నమా? అని ప్రశ్నించారు.