నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటితో పచ్చి అబద్ధాలు మాట్లాడించారు అని విమర్శించారు. పాపం రాహూల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెబితే అది మాట్లాడి పోయాడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని అన్నారు.
మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్లు ఏదో ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకున్నారు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలోనే 503 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు.మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరిట మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్ని పేపర్‌లో యాడ్స్ ఇచ్చారు.మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను వాళ్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు అని ఆరోపించారు .