ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమని అన్నారు బిజెపి నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. లిక్కర్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి రెండు ఆమె అని ఆరోపించారు. అయితే ఆమె అరెస్టును కూడా సానుభూతిగా రాజకీయాలకు వాడుకుంటారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కవిత మహిళా హక్కుల కోసం పోరాడుతుందట అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర మహిళా గవర్నర్ తమిళి సై గురించి బిఆర్ఎస్ నేతలు పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడుతున్న పట్టించుకోని కవిత.. ఢిల్లీలో మహిళల గురించి ధర్నా చేస్తుందట అని ఎద్దేవా చేశారు. కవిత ఓ మహిళా ద్రోహి అని, ఆమెకి మహిళల ఉసురు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం దారుణమని మండిపడ్డారు. కేవలం రాజకీయాల కోసమే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఆరోపించారు.