అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడానికి వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సర్వం నాశనమైందని..అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము కలుస్తున్నట్లు అటు చంద్రబాబు, ఇటు పవన్ చెబుతున్నారు. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి చాలా ఇబ్బంది. రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తేనే ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అవుతుంది. కలిస్తే మాత్రం రిస్కే.
అందుకే రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి-జనసేనలని రెచ్చగొట్టేలా…దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్ళు విసురుతున్నారు. ఇటీవల జగన్ సైతం అదే తరహాలో సవాల్ చేశారు. టిడిపి-జనసేనలకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. అంటే ఆ సవాల్ ఓ రకంగా రెచ్చగొట్టడమే అని చెప్పాలి. ఆ సవాల్ వల్ల టిడిపి-జనసేన రెచ్చిపోయి, పొత్తు పెట్టుకోకుండా విడిగా పోటీ చేస్తే..తమకు లబ్ది చేకూరుతుందనేది వైసీపీ ప్లాన్.
అందుకే ఆ విధంగా సవాళ్ళు చేస్తున్నారు. అదే సమయంలో టిడిపి సైతం అదే తరహాలో కౌంటర్లు ఇస్తుంది..అసలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వద్దో..చెప్పడానికి జగన్ ఎవరు అని అంటున్నారు. తాము ఏమున్నా డైరక్ట్ గా పొత్తు పెట్టుకుంటామని, కానీ జగన్ కొన్ని పార్టీలతో చీకటి ఒప్పందాలు చేసుకోమని ఆంటున్నారు.
అదే సమయంలో టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు..జగన్‌కు ఓ సవాల్ చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో దమ్ముంటే వైసీపీకి ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. అలాగే 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలవా? టిడ్కో ఇళ్లని పేదలకు పంచగలవా? రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నికలకు రాగలవా? అని ప్రత్తిపాటి..జగన్ కు సవాల్ విసిరారు. మొత్తానికి టిడిపి-వైసీపీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది.