కలిస్తే కాంగ్రెస్‌ని ఆపడం కష్టమే!

-

కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది..ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉండి చివరిగా 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత నుంచి ఏపీలో గాని, తెలంగాణలో గాని కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఏపీలో ఎలాగో పార్టీ దారుణంగా నష్టపోయింది..కాబట్టి అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చే అవాకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఉన్నది తెలంగాణ మాత్రమే…ఇక్కడే పార్టీకి కాస్త ఛాన్స్ ఉంది.

కానీ మంచి అవకాశాలని కూడా కాంగ్రెస్ నేతలే చేజాతుల నాశనం చేసుకుంటున్నారు. 2014లో అంటే అప్పటివరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది..పైగా తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్‌ వైపు ప్రజలు మొగ్గు చూపారు. దీంతో అప్పుడు పార్టీ ఓడిపోయింది. కానీ 2018లో చేజాతుల మహాకూటమి అంటూ పొత్తులు పెట్టుకుని దారుణంగా ఓడిపోయింది. సరే రెండోసారి కూడా ప్రతిపక్షానికి పరిమితమైంది.

ఇలా రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ మూడో సారి కూడా అధికారంలోకి రాకపోతే, ఇంకా తెలంగాణలో కూడా పార్టీ తట్టా బుట్టా సర్దుకోవచ్చు. ఆ పరిస్తితి తెచ్చుకోకుండా ఉంటే బెటర్..కానీ కాంగ్రెస్ నేతలు అదే పరిస్తితి తెచ్చుకునేలా ఉన్నారు. అసలు ఇప్పుడుప్పుడే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత వస్తుంది..ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు బలపడే అవకాశం ఉంది..కానీ ఆ ఛాన్స్ బీజేపీకి వస్తుంది. కాంగ్రెస్‌లో ఉండే లుకలుకలు బీజేపీ ఎదిగేందుకు కలిసొస్తున్నాయి. నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఉన్నారు..ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరుతో తలనొప్పులు ఉన్నాయి.

అయితే నాయకులు ఈ రచ్చని పక్కనబెట్టి…కలిసికట్టుగా పనిచేస్తే..కాంగ్రెస్‌ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే తెలంగాణలో బలమైన క్యాడర్, నాయకత్వం ఆ పార్టీకి ఉంది. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల పార్టీ రేసులో ఉంది…ఆయనతో సీనియర్లు కూడా కలిసి పనిచేస్తే…కాంగ్రెస్‌ని ఏ శక్తి ఆపలేదు. అలా కాకుండా తాము ఇలాగే గొడవలు పడతామని అనుకుంటే మాత్రం కాంగ్రెస్‌ని ఎవరు కాపాడలేరు.

Read more RELATED
Recommended to you

Latest news