వాడెవడో పట్టాభి అంట, ఎక్కడ ఉంటాడు…? కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో తీర ప్రాంత ప్రజల పాట్లు చూశారని, గాలి కబుర్లు చెప్పి గాలికే వదిలేసిన ప్రభుత్వాలు చూశామని ఆయన అన్నారు. మత్య్సకార రంగాన్ని అన్ని విధాలా సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. చంద్రబాబు ఖాళీగా కూర్చొని 500 మంది రాష్ట్ర కార్యదర్శులు, వెయ్యి మంది ఉపాధ్యక్షులను చేశారని ఆయన విమర్శించారు.

ఎవడికి వాడు పిచ్చవాగుడు వాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజానీకం సమస్యలు చూసి మాట్లాడాలని, కానీ పార్టీ ఆఫీస్ లో బ్రోకర్ పనులు చేసుకుంటూ.. పార్టీ ఆఫీస్ లో పేపర్లు మోసుకుంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే జీతాలమీద ప్రెస్ మీట్ కొచ్చి మాట్లాడే వెదవలు ఉన్నారని, అటువంటి మాటలకు నేనేం చెబుతాను, వాడేవడో కూడా నాకు పరిచయం లేదని ఆయన ఎద్దేవా చేసారు. వాడేవడో పట్టాభి.. భుట్టాభి అంటున్నారు, ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదన్నారు.