చాట్‌ జీపీటీని బ్యాన్‌ చేసిన తొలి యూరోపియన్‌ కంట్రీగా ఇటలీ!

-

ఇటలీ చాట్‌జీపీటీ ని తమ దేశంలో బ్యాన్‌ చేస్తున్నట్లు తెలిపింది. టెక్నాలజీ ప్రపంచంలోకి రాగానే సంచలనాలు సృష్టిస్తోంది ‘చాట్‌ జీపీటీ’ . ఇదో కొత్తతరం సెర్చ్‌ ఇంజిన్‌. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో పనిచేసే ఈ టూల్‌ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చాట్ జిపిటీ . లాంఛ్ అయిన కొద్దినెల‌ల‌కే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన చాట్‌జీపీటీ పెను తుఫాను రేపుతోంది. సంక్లిష్ట స‌మ‌స్యల‌నూ ఇట్టే ప‌రిష్కరిస్తున్న ఈ ఏఐ టూల్‌కు తాజాగా షాక్‌ తగిలింది. . దీంతో చాట్‌ జీపీటీని బ్యాన్‌ చేసిన తొలి యూరోపియన్‌ కంట్రీగా ఇటలీ నిలిచింది. ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ.. చాట్‌ జీపీటీపై అభ్యంతరాలు తెలిపింది. ఈ టూల్‌ యూజర్స్‌ నుంచి అక్రమంగా వివరాలు సేకరిస్తోందని, ఏజ్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ కూడా లేదని వెల్లడించింది. మైనర్లు ఈ టూల్‌ను దుర్వినియోగపరిచే ప్రమాదముందని వెల్లడించింది. ప్రైవసీ పరంగా ఈ టూల్‌ సేఫ్‌ కాదని వ్యక్తపరిచింది ఇటలీ ప్రభుత్వం .

ChatGPT | చాట్‌ జీపీటీని బ్యాన్‌ చేసిన ఇటలీ

చాట్‌జీపీటీ తన వినియోగదారుల వయస్సును చెక్‌ చేయడంలో విఫలమైందని ఏజెన్సీ ఆరోపించింది. ఈ చాట్‌బాట్‌ 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండాలని అభిప్రాయపడింది. అదేవిధంగా గతవారం కొందరు యూజర్లు చాట్‌జీపీటీలో ఇతరుల చాట్‌ హిస్టరీ కనిపిస్తోందని తెలిపారు. దీంతో చాట్‌బాట్‌లో డేటా సురక్షితం కాదని ఇటలీ రెగ్యులేటర్లు ఆందోళన వ్యక్తపరిచారు. అందువల్లనే అడ్వాన్స్‌డ్‌ చాట్‌బాట్‌ను నిషేధించాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలిపింది ఇటలీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news