నిన్న ప్రియుడి వేధింపులతో ట్రైన్ కి ఎదురెళ్ళి సూసైడ్ చేసుకున్న శ్వేత తల్లితండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. గత నెల 18వ తేదీన కిరణా షాపుకు వెళ్లి వస్తానని బయటికి వెళ్ళిందని, ఆ తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సి నగర్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించిందని పేర్కొన్నారు.
శ్వేతది ఆత్మహత్యగా చిత్రీకరించారని, ఒకవేళ శ్వేత ఆత్మహత్య చేసుకుంటే రైలు పట్టాల మధ్యలో డెడ్ బాడీ ఉండదని అన్నారు. రైలు వేగానికి పక్కకు పడి ఉండేదని అన్నారు. ఆమెను అజయ్ హత్య చేసి పెట్టాలి పై పడేసాడని, శ్వేత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. ఇలాంటి ఘటన మరో కుటుంబంలో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అజయ్ కు ఉరిశిక్ష విధించాలని అలానే ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ సిఐతో పాటు టెక్నీషియన్ రతన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.