సస్పెన్స్ థ్రిల్లర్ గా “ఇచ్చట వాహనములు నిలుపరాదు” ట్రైలర్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత ప్రస్తుతం చేస్తున్న సినిమా ”ఇచ్చన వాహనములు నిలుపరాదు”. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్‌ హీరోగా.. ఈ మూవీ రానుండగా.. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌ కు సిద్ధం అయింది. ఈ నేపథ్యం లోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

కాగా.. వాస్తవ సంఘటన ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సుశాంత్‌ కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అభినవ్‌ గౌతమ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌ బ్యానర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఎం సుకుమార్‌ సినిమాటో గ్రాఫర్‌ గా పనిచేస్తున్నాడు. కాగా.. ఆగస్ట్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news