ట్రైలర్ టాక్: నవ్వించడానికి వస్తున్న జాతి రత్నాలు..

-

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా జాతి రత్నాలు. రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. నవీన్ పోలిశెట్టి లేడిస్ ఎంపోరియం శ్రీకాంత్ గా కనిపిస్తున్నాడు. టెన్త్ లో 60శాతం, ఇంటర్ లో 50శాతం, బీటెక్ లో 40శాతం మార్కులేంట్రా అంటే అందుకే ఎమ్ టెక్ చేయలేదని చెప్పే సమాధానం నవ్వు తెప్పిస్తుంది.

హీరోయిన్ చాలా అందంగా ఉంది. ఇందులో తనకి కూడా ప్రాధాన్యమున్న పాత్రలాగే కనిపిస్తుంది. ఆ పాత్రతో ప్రేమలో పడే శ్రీకాంత్ చేసే కామెడీ హైలైట్ గా ఉండనుందని తెలుస్తుంది. అనుకోకుండా కేసులో ఇరుక్కుని జైళ్ళో చేసే కామెడీ మరో హైలైట్ గా ఉంటుందని అనిపిస్తుంది. అక్కడ వెన్నెల కిషోర్ నవ్వుల పువ్వులు పూయించనున్నాడు. ఇక చివర్లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనదైన స్టైల్ లో మళ్ళీ మురిపించాడు. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించారు. శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news