మల్లెమాలపై షాకింగ్ కామెంట్ చేసిన జబర్దస్త్ యాక్టర్.. కారణం ఏమిటంటే..!!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ షో గడిచిన ఆరు నెలల కింద వరకు మంచి టాప్ పొజిషన్లో ఉండేది. కానీ నెమ్మదిగా అందులో నటించే కమెడియన్లు సైతం ఒక్కొక్కరుగా విడిపోవడం జరిగింది. దీంతో జబర్దస్త్ షో రేటింగ్ కాస్త దారుణంగా పడిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇందులో వీడిన వారంతా ఇతర ఛానల్ లో ప్రసారమవుతున్న కొన్ని షోలకు వెళ్లడం జరిగింది. అలా వెళ్లినవారిలో కిరాక్ ఆర్పి కూడా ఒకరిని చెప్పవచ్చు. కామెడీ స్టార్స్ అనే షో లో ఎంట్రీ ఇచ్చారు.

ఇక అంతే కాకుండా తన కాబోయే భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలోఆర్పి జబర్దస్త్ పైన ,మల్లెమాల సంస్థ పైన , అందులో ఉన్న వారి పైన సంచలన వాక్యాలు చేయడం జరిగింది. మల్లెమాల సంస్థ యజమాని శ్యాం ప్రసాద్ రెడ్డి చేసేది ఒక వ్యాపారమే అని తెలియజేశారు. నాగబాబు చేసేది మాత్రం వ్యవహారమని తెలియజేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వారు ఎవరికి సహాయం చేయరని కేవలం వారి దృష్టి అంత వ్యాపార ఆలోచనలోనే ఉంటుంది అని, కానీ నాగబాబు మాత్రం అందరికీ సహాయం చేస్తూ సమస్యలను తీరుస్తూ ఉంటారని తెలిపారు.

మల్లెమాల సంస్థ వారు పెట్టే భోజనం గురించి తనని అడగవద్దని ఎందుచేత అంటే అది చాలా చెండాలంగా ఉంటుంది దాని, ఎందు కంటే చర్లపల్లి జైల్లో భోజనమే బెటరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు విషయాలతోనే నాగబాబు తన పేరును గుండెల మీద పొడిపించుకున్నానని తెలియజేశారు కిరాక్ ఆర్పి. తనకు నాగబాబు ఎంతో సహాయం చేశారని తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న ఇంట్లో వివాహానికి ఒప్పించడం కోసం విశాఖపట్నం కి వెళ్ళాక ఆ సమయంలో నాగబాబు తనకు అండగా నిలిచారని తెలిపారు. జబర్దస్త్ లో కేవలం మేము కమెడియన్లుగా ఉపయోగపడుతున్నాము కాబట్టే వారు మాకి ఎంతో కొంత రెస్పెక్ట్ డబ్బులు ఇస్తున్నారని తెలిపాడు ఆర్పి. ఆర్పి చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.