ఇటీవల కాలంలో పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్న నేపథ్యంలో చాలామంది బలహీనంగా తయారవుతున్నారు. ఏ పని చేయలేకపోతున్నారు. కొంత పని చేయగానే వారికి నీరసం అనిపించడం.. సరిగ్గా నిలబడలేకపోవడం.. ఎక్కువసేపు పడుకోవాలి అనే భావన లాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.. అయితే మీలో ఎవరైనా సరే బలహీన సమస్యతో బాధపడుతున్నట్లయితే అశ్వగంధ విత్తనాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.ఇక ఈ గింజలను ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.. ఇటీవల కాలంలో చాలామంది పని ఒత్తిడి కారణంగా నిరాశ , చిరాకు, కోపం, ఆందోళన వంటి సమస్యలకు గురి అవుతున్నారు. వీటికి అడ్రినల్ హార్మోన్స్ , కార్టిసాల్ హార్మోన్లు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఇకపోతే ఈ రెండు హార్మోన్లను నియంత్రణలో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందట. అయితే ఈ రెండు హార్మోన్ల నియంత్రణలో ఉంచాలి అంటే అశ్వగంధ గింజలు చాలా బాగా సహాయపడతాయి మనలో రోగ నిరోధక వ్యవస్థ పెరగాలంటే ఈ గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఇక అశ్వగంధ గింజలలో ఉండే స్టెరాయిడ్ లాక్టోను, స్టెరాయిడ్ గ్లైకోసైడ్ అనే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను మామూలు స్థితికి తీసుకొచ్చి శరీరానికి వ్యతిరేకంగా పనిచేయకుండా నిరోధిస్తాయి. ఇక ఇలా చేయడం వల్ల మనలో ఇమ్యూనిటీ డిజార్డర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నియంత్రించబడతాయి.
ఇక కడుపులో ఏర్పడే నొప్పి, ప్రేగులో ఏర్పడే అల్సర్లు తగ్గించడానికి కూడా అశ్వగంధ గింజలు చాలా బాగా పనిచేస్తాయి. మీలో ఎవరికైనా నరాల బలహీనత అనిపిస్తున్నట్లయితే అశ్వగంధ గింజలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మీ ఆయుష్షుని పెంచడానికి కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి. ఇక శక్తిని పెంచడానికి అశ్వగంధ గింజలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇక బలహీనతతో బాధపడేవారు అశ్వగంధ గింజలను తీసుకోవడం వల్ల చురుకుగా , బలంగా తయారవుతారు. ముఖ్యంగా అశ్వగంధ గింజలతో తయారు చేసిన పొడిని తేనెలో లేదా నీటిలో లేదా పాలలో కలిపి తాగవచ్చు.